పరిశ్రమల పేరుతో గతంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని పరిశ్రమలు పెట్టనప్పుడు ఆ భూములను తిరిగి రైతులకు స్వాధీనం చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో జరుగుతున్న భూ వ్యవహారలపై సీఎం జగన్ ఉన్నత స్థాయి కమిటీని వేయాలని కోరారు. గతంలో గుమ్మనూరులో పేకాట శిబిరం నిర్వాహణ... తాజాగా భూ వ్యవహారం బయటపడిందని మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయడం తగదని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
'భూ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలి' - మంత్రి గుమ్మనూరు జయరాం భూ వ్యవహారం తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పరిశ్రమల పేరుతో కొనుగోలు చేసిన భూములను మంత్రి గుమ్మనూరు జయరాం కొనుగోలు చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
cpm leader prabhakar reddy fires on minister gummanuru jayaram