ఓర్వకల్లులో సీపీఎం నాయకుడు మధు పర్యటన - cpm madhu
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లో సిపిఎం నాయకుడు మధు పర్యటించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారికి తగిన సూచనలు అందించారు.

ఓర్వకల్లులో సీపీఎం నాయకుడు మధు పర్యటన
ఓర్వకల్లులో సీపీఎం నాయకుడు మధు పర్యటన
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పలు గ్రామాల్లో సీపీఎం నాయకుడు మధు పర్యటించారు. శకునాల గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో సమావేశం నిర్వహించారు. కూలీలకు అందాల్సిన వసతులు, ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుట్టపాడు గ్రామంలోని రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. రైతుల అనుమతులు లేకుండా పొలాలు ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులంతా కలిసికట్టుగా అధికారులను అడిగితే కోల్పోయిన పొలాలకు నష్టపరిహారం అందుతుందని సూచించారు.