అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలనీ.. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన జీ ప్లస్ త్రీ ఇళ్లను కేటాయించాలని సీపీఎం ఆధ్వర్యంలో ప్రజలు కర్నూలులో ఆందోళనకు దిగారు. ఇందిరాగాంధీ నగర్ వార్డు సచివాలయం ముందు బైఠాయించి ప్రజలు, నాయకులు నిరసన తెలిపారు. గతంలో కేటాయించిన ఇళ్లను కాకుండా నగరానికి దూరంగా ఉన్న స్థలాలను పేదలకు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు ఉంటే విచారణ జరిపించాలనీ... లబ్ధిదారులకు మాత్రం న్యాయం చేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
'అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి-సీపీఎం' - cpm agitation in kurnool
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కర్నూలు జిల్లా సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. నగరానికి దూరంగా స్థలాలను కేటాయించటమేంటని నిలదీశారు.
!['అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి-సీపీఎం' cpm agitation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8140475-58-8140475-1595497354421.jpg)
సీపీఎం నిరసన