ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదోనిలో టిడ్కో అపార్ట్​మెంట్లను పరిశీలించిన సీపీఐ రామకృష్ణ - టిడ్కో అపార్ట్మెంట్లను పరిశీలించిన సీపీఐ రామకృష్ణ

కర్నూలు జిల్లా ఆదోనిలో నిరుపేదల కోసం నిర్మించిన టిడ్కో అపార్ట్​మెంట్లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ నెల 16వ తేదీలోపు అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు.

cpi state secretary ramakrishna inspects tidco apartments in adoni at kurnool district
అదోనిలో టిడ్కో అపార్ట్మెంట్లను పరిశీలించిన సీపీఐ రామకృష్ణ

By

Published : Nov 4, 2020, 11:33 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టిడ్కో అపార్ట్​మెంట్లను పరిశీలించారు. అర్హులైన నిరుపేదలకు అపార్ట్​మెంట్​ ఇళ్లు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభం కోసం పేదల బతుకులతో అడుకుంటే సీపీఐ పార్టీ సహించదన్నారు. ఈ నెల 16వ తేదీలోపు అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందజేయకుంటే సీపీఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details