కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీపీఐ వర్గాలు ఆందోళన చేశారు. పట్టణంలో నిర్మించిన ప్రభుత్వ గృహాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయకుండా సర్కారు నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ నెల 16నాటికి లబ్దిదారులకు ఇళ్లు కేటాయించపోతే తమ పార్టీనే పంపిణీ కార్యక్రమం చేపడుతుందని ఆయన అన్నారు.
పేదలకు ఇళ్ల పంపిణీ చేపట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి - yemmiganur latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో సీపీఐ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం ఇంకా పంపిణీ చేయకపోవటంపై నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తున్న సీపీఐ పార్టీ శ్రేణులు