ఈ నెల 27న రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే భారత్ బంద్ విజయవంతం చేయాలని సీపీఐ కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టింది. నగరంలోని బళ్లారి చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేవేటీకరణ చెయ్యడాన్ని నిరసిస్తూ ఈనెల 21 విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈనెల 27న జరిగే భారత్ బంద్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైకాపా, తెలుగుదేశం పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ నెల 27న భారత్ బంద్‌కు వైకాపా, తెదేపాలు కలిసి రావాలి: రామకృష్ణ - కర్నూలులో సీపీఐ భారీ ర్యాలీ
ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చెయ్యడాన్ని నిరసిస్తూ ఈనెల 21 విశాఖలో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈనెల 27న జరిగే భారత్ బంద్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైకాపా, తెలుగుదేశం పార్టీలు పాల్గొనాలని ఆయన కోరారు.
సీపీఐ