సీఎం మొండి వైఖరిపై సీపీఐ రామకృష్ణ మండిపాటు
సీఎం జగన్ మొండి వైఖరిపై సీపీఐ రామకృష్ణ మండిపాటు - సీఎంపై మండిపడ్డ సీపీఐ రామకృష్ణ
అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. మహమ్మద్ బీన్ తుగ్లక్ రాజధాని మార్చే క్రమంలో అన్నీ తరలించగా.. జగన్ అలాకాకుండా పాలన కొంత అమరావతిలో... విశాఖలో మరికొంత అనడం ఏ మాత్రం సరికాదని విమర్శించారు. కేవలం కసితోనే రాజధాని మార్పు తప్ప మరే ఉద్దేశ్యం లేదన్నారు. రాజధాని అంశంలో సీఎం జగన్ మొండి వైఖరి విడనాడాలని... లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
![సీఎం జగన్ మొండి వైఖరిపై సీపీఐ రామకృష్ణ మండిపాటు cpi ramakrishna fires on cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5787375-543-5787375-1579605768321.jpg)
సీఎం మొండి వైఖరిపై సీపీఐ రామకృష్ణ మండిపాటు