మండు వేసవిని సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్న ఉపాధి కూలీలను సరైన వేతనాలు ఇచ్చి ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో ముచ్చటించి వారి కష్టాలను తెలుసుకున్నారు. మండుటెండలో చేతులకు బొబ్బలొచ్చేలా...పని చేస్తున్నా సరైన వేతనాలు రావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 370 కరువు మండలాలను గుర్తించిన ప్రభుత్వం.. వెంటనే వారికి పంట నష్ట పరిహారం అందించాలని కోరారు.
ఉపాధి కూలీలను ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ - kurnool
కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. మండు వేసవిని సైతం లెక్కచేయకుండా పనులు చేస్తున్న ఉపాధి కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
సీపీఐ రామకృష్ణ