CPI Ramakrishna comments on YSRCP : నకిలీ విత్తనాలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కర్నూలు జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా మేలు చేశారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క పిల్ల కాలువను సైతం తవ్వలేదని.. రైతులకు ఏం చేశారో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా మేలు చేశారా..? : రామకృష్ణ - cpi demand for crop loss compensation
CPI Ramakrishna comments on YSRCP : రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకైనా మేలు చేశారా అని ముఖ్యమంత్రిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర నిర్వహించి.. కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. నకిలీ విత్తనాలు నాటి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న ముఖ్యమంత్రి బయటకు రావడం లేదని.. ఒకవేళ వస్తే పరదాలు వేసుకుని వస్తున్నారని.. పరదాలకు బదులు బురఖా వేసుకోవాలని విమర్శించారు. 150 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు ఉన్న సీఎం బయటకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. రైతులకు మద్దతుగా పోరాటం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని కోరారు. కోట్లు ఖర్చు చేసి సీమ గర్జన పేరుతో రాయలసీమ వాసులను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని అన్నారు.
ఇవీ చదవండి: