కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీసు స్టేషన్ ముందు సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామాల్లో గొలుసు దుకాణాలను పూర్తిగా అరికడుతామని ప్రభుత్వం చెప్తుతున్నా... క్షేత్రస్థాయిలో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయని సీపీఐ నియోజకవర్గ నాయకులు పంపన్నగౌడ్, సత్యన్న ఆరోపించారు. వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ మహేష్కుమార్కు వినతి పత్రం అందజేశారు.
'గొలుసు దుకాణాల్లో కల్తీ కల్లును అరికట్టండి' - కర్నూలు జిల్లాలో సీపీఐ నేతల ధర్నా వార్తలు
గొలుసు దుకాణాల్లో కల్తీ కల్లును అరికట్టాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.

'గొలుసు దుకాణాలను నిర్మూలించండి'