రైతులకు పంటల భీమా, కరువు నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని సీపీఐ ఆందోళనకు దిగింది. రైతులతో కలిసి డోన్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిపిఐ నేతలు, రైతులకు చెల్లించాల్సిన 4, 5 వ విడత రుణమాఫీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా నగదును కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రూ.12,500 లను రైతుల ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షాబావంతో తల్లడిల్లుతోన్న డోన్ ను కరవు మండలంగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు.
చివరి విడత రుణమాఫీ చేయాలి - karnool district
4, 5 వ విడత రుణమాఫీ చేయాలంటూ కర్నూలులో రైతులు నిరసనకు దిగారు. వారికి సీపీఐ మద్దతుగా నిలచింది.
cpi-leaders-protestsfront-of-done-thahasildar-office-at-karnool-district