కొవిడ్ సమయంలో విధులు నిర్వహించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కొవిడ్ వారియర్స్ పోరాట సమితి కర్నూలులో ధర్నా చేపట్టింది. కష్ట సయమంలో తమ సేవలను ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత రోడ్డున పడేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. 24 రోజులుగా నిరసన తెలుపుతున్న తమను ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. వైద్యరంగంలో తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
కర్నూలులో కొవిడ్ వారియర్స్ పోరాట సమితి ధర్నా
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో కొవిడ్ వారియర్స్ పోరాట సమితి ధర్నా చేపట్టింది. 24 రోజులుగా నిరసన తెలుపుతున్న తమను ఎవరూ పట్టించుకోవడంలేదని..వైద్యరంగంలో తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
కర్నూలులో కొవిడ్ వారియర్స్ పోరాట సమితి ధర్నా..