కర్నూలు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. నగరంలోని శ్రీరామ్‌నగర్ ప్రాథమిక పాఠశాల, మెడికొవర్ ప్రైవేట్ హాస్పిటల్, ఈ తాండ్రపాడు పీహెచ్సీలో డ్రై రన్ జరిగింది. కార్యక్రమం జరుగుతున్న తీరును...కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు. 1530 వ్యాక్సినేషన్ సెషన్ సైట్స్ (వ్యాక్సిన్ కేంద్రాలు) అందుబాటులో ఉంచామని...ప్రతి సెషన్ సైట్లో రోజుకు 25 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు.
కర్నూలు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్
కర్నూలు జిల్లాలోని మూడు ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. మెుదటి విడతలో కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు.
కర్నూలు జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్
హెల్త్ వర్కర్స్, పోలీస్, రెవెన్యూ, 50 సంవత్సరాల వయస్సు దాటిన వారు కో మార్బిడిటీ తదితర 4 కేటగిరీల కింద కొవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికే మెుదటి విడతలో వాక్సిన్ ఇవ్వనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి