' కరోనాపై పోరు...కర్నూలు జిల్లాకు ప్రత్యేక అధికారుల నియామకం' - కర్నూలు కరోనా వార్తలు లేటెస్ట్
కర్నూలు జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణలో యంత్రాంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఆ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
'కర్నూలు జిల్లాకు ప్రత్యేక అధికారుల నియామకం'
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఆ జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ హరినారయణతో పాటు ఏపీఎన్నార్టీ సీఈఓ బి.శ్రీనివాసరావులను జిల్లా కోవిడ్ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు. తక్షణం ఇద్దరు అధికారులు ఆ జిల్లా కలెక్టర్ కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.