ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రంలో సమస్యలు... కొవిడ్ బాధితుల ఆందోళన - సౌకర్యాలు కల్పించలేదని నంద్యాలలో కరోనా రోగుల నిరసన

ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంలో భోజన వసతులు సరిగా లేవని కొవిడ్ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఎస్​ఆర్బీసీ కాలనీలోని టిడ్కో గృహాల్లోని క్వారంటైన్ కేంద్రంలో మధ్యాహ్నం ఆహారానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన చెందారు.

covid patients agitation in nandyala quarantine
నంద్యాలలో క్వారంటైన్ కేంద్రంలో కొవిడ్ బాధితుల ఆందోళన

By

Published : May 5, 2021, 4:50 PM IST

నంద్యాల క్వారంటైన్ కేంద్రంలో ఇదీ పరిస్థితి!

కర్నూలు జిల్లా నంద్యాల ఎస్​ఆర్బీసీ కాలనీలోని టిడ్కో గృహాల్లో.. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కొవిడ్ బాధితులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 1,000 మంది కరోనా రోగులు అక్కడ చికిత్స పొందుతుండగా.. తమకు ఆహారం అందించే విధానం సరిగా లేదని వాపోతున్నారు. భోజనానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి.. అల్పాహార ప్యాకెట్లను గుంపులుగా చేరి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తమ అవస్థలపై అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:చేతులు పదేపదే కడుగుతున్నారా?

మందుల పంపిణీ సరిగా లేదు:

భోజనం సరిగా లేదని, మాత్రలు ఇవ్వడం లేదంటూ.. కొవిడ్ బాధితులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. క్వారంటైన్ కేంద్రానికి పరిమితికి మించి అధిక సంఖ్యలో రోగులను తరలించారని ఆరోపించారు. ఈ క్రమంలో తగిన వసతులు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details