ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆగస్టు 21 నుంచి కరోనా డౌన్ ట్రెండ్ ప్రారంభమవుతుంది'

రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇన్ ఫెక్షన్ బాగా పెరిగిన తర్వాత... తప్పనిసరిగా తగ్గుతుందని స్పష్టం చేశారు. ఈనెల 21 నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయన్న ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి..

'ఆగస్టు 21 నుంచి కరోనా డౌన్ ట్రెండ్ ప్రారంభమవుతుంది'
'ఆగస్టు 21 నుంచి కరోనా డౌన్ ట్రెండ్ ప్రారంభమవుతుంది'

By

Published : Aug 11, 2020, 11:25 PM IST

'ఆగస్టు 21 నుంచి కరోనా డౌన్ ట్రెండ్ ప్రారంభమవుతుంది'
  • ప్రశ్న: ప్రధానంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా ఎప్పుడు అదుపులోకి వచ్చే అవకాశముంది?

జవాబు: ఇప్పుడు మనం 25 లక్షల టెస్ట్ మార్క్‌ చేరాం. ఎపిడమిక్ డిసీజ్ ప్యాండమిక్ అయినప్పుడు స్లోగా విస్తరిస్తుంది. పీక్‌ నంబర్ ఆఫ్ ఇనెఫెక్షన్‌కు వచ్చిన తరువాత మెల్లగా తగ్గుతుంది. ఈస్ట్ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పీక్ స్టేజ్‌కు చేరి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 21 నుంచి డౌన్ ట్రెండ్ కొనసాగి ఒక నెలలో తగ్గే అవకాశం ఉంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, కడప జిల్లాల్లో సెప్టెంబర్ మొదటి వారాల నుంచి పీక్ డిక్లెయిన్ కావడం మొదలవుతుంది. మరణాల రేటు పాయింట్ ఐదు శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక సైంటిఫిక్ అనాలసిస్. ఎపిడమాలజిస్టుల సలహాలతోనే పరీక్షలు చేయడం, బెడ్స్‌, ఆక్సిజన్‌ సిద్ధం చేసుకోవడం లాంటివి చేస్తున్నాం. సెప్టెంబర్ నంచి పరీక్షలు చేయడం కూడా తగ్గించవచ్చు.

  • ప్రశ్న: ఇప్పటి వరకు ఎంత మందికి కరోనా వచ్చి తగ్గి ఉండవచ్చు ?

జవాబు : పరీక్షలు చేయించుకోని వారు కూడా ఉంటారు. లక్షణాలు లేకుండా ఉన్నవారిని సీరో సర్విలెన్స్ అంటారు. మన రాష్ట్రంలో సీరో సర్విలెన్స్ చేసినప్పుడు అత్యధికంగా 15 శాతం పైగా ఉంది. అనంతపురంలో అనధికారికంగా 23 శాతం ఉంది. శనివారం నుంచి భారీగా క్లస్టర్ల వారీగా చేయించబోతున్నాం. లక్షణాలు, జబ్బు లేని వారి నుంచి రక్తం సేకరించి సిరో సర్విలెన్స్ చేయబోతున్నాం. దీంతో మనం హెర్డ్ ఇమ్యూనిటీ ఎంత ఉందనేది నిర్ధారణ చేయవచ్చు. నవంబర్ లోగా హెర్డ్ ఇమ్యూనిటీ 60 శాతం వచ్చిందంటే వ్యాక్సిన్ అవసరం లేకపోయినా కూడా మనం అశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

  • ప్రశ్న: హెర్డ్​ ఇమ్యూనిటీ 60 శాతం వస్తే అందరికి వచ్చి పోయినట్లేనా ?

జవాబు : హెర్డ్​ ఇమ్యూనిటీ 60 శాతం వచ్చిందంటే ఇక 40 శాతం మంది మాత్రమే ఉంటారు. వారిలో చిన్న పిల్లలు, వృద్ధులు, ఎక్కువ బయట తిరగని వారు ఉంటారు. వారికి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. జన జీవితంలో రొటీన్ వర్క్ నడుస్తుంది. మెల్లగా వ్యాక్సిన్ వస్తుంది.

  • ప్రశ్న: పరీక్షలు తగ్గించే అవకాశం ఉందన్నారు. తీవ్రత తగ్గిందని పరీక్షలు తగ్గిస్తున్నారా ?

జవాబు : తీవ్రత తగ్గితే పరీక్షలు తగ్గించ్చవచ్చు. ఇన్​ఫెక్షన్​ రేటు ఆధారంగా పరీక్షలు పెంచుకుంటూ పోయాం. పరీక్షలు ఎక్కువే చేశాం. అత్యధికంగా పరీక్షలు చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉంది. ఇన్‌ఫెక్షన్‌ తగ్గిపోతే పరీక్షలు చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

  • ప్రశ్న: ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: ఫిర్యాదులు ఇవ్వడం లేదు. 90 శాతం వైద్యం ప్రభుత్వాసుపత్రిలో జరుగుతుంది. ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం పెద్ద విషయం కాదు. ప్రభుత్వం చర్యలు తీసుకునేంత వరకు పోకుండా స్వీయ నియంత్రణలో ఉండాలి.

  • ప్రశ్న: ఆసుపత్రుల్లో ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?

జవాబు : ప్రైవేటు ఆసుపత్రుల్లో కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని చూడాలి. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది.

  • ప్రశ్న: ప్రజలకు కరోనా గురించి ఏం చెబుతారు ?

జవాబు: కరోనా గురించి ఎక్కువగా భయపడకండి. వైరస్ అత్యంత ప్రమాదకరమైంది కాదు. హోం ఐసోలేషన్‌లో ఉండి 80 శాతం కోలుకుంటున్నారు. అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరొద్దు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యున్నత ప్రమాణాలతో వైద్యం లభిస్తోంది.

ఇదీ చదవండి:తెలంగాణ ప్రాజెక్టులకే కొత్త ఆయకట్టు: జగన్

ABOUT THE AUTHOR

...view details