కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం కొత్తగా 781 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 40 వేల 100 మందికి కరోనా సోకగా... 33వేల 270 మంది కరోనాను జయించారు. 6, 493 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల నుంచి 210 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ కేసులు 40 వేలు దాటేశాయ్
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలో 40 వేల కేసులు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 781 కొత్త పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా 40 వేల 100 మంది వైరస్ బారిన పడ్డారు.
కర్నూలు జిల్లాలో కొవిడ్ విజృంభణ