ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగరంపై వైరస్‌ పడగ.. ప్రజల్లో ఆందోళన

నగరంలో లాక్​డౌన్​ను​ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా... కరోనా వ్యాప్తిని అధికారులు అదుపు చేయలేకపోతున్నారు. ఆదివారం కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని మొత్తం కేసుల్లో సగం కర్నూలులోనే ఉండటంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

covid cases increasing in kurnool city
రక్షణ దుస్తులతో విధుల్లో పారిశుద్ధ్య సిబ్బంది

By

Published : Apr 27, 2020, 4:39 PM IST

కర్నూలు నగరంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. వైరస్‌ ఉద్ధృతిని చూసి పలువురు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం జిల్లాలో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో స్థానిక కొత్తపేటకు చెందిన మహిళ, వన్‌టౌన్‌ ప్రాంతంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నమోదయ్యాయి. జిల్లాలోని మొత్తం కేసుల్లో కర్నూలులోనే సగం పైగా కేసులు ఉండటం, 80 శాతం ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ఆత్మకూరులో కొత్తగా ఒక కేసు నమోదైంది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి, విశ్వభారతి, శాంతిరామ్‌ వైద్యశాలల్లో 239 మంది చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రత్యేకంగా మెనూ అమలు చేయాలని ఉన్నా సర్వజన వైద్యశాలలో మెనూ సక్రమంగా లేదని పలువురు కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. రుచీపచీ లేని ఆహారం తినలేకపోతున్నామని ఓ బాధితుడు వాపోయారు. నాణ్యమైన భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

పారిశుద్ధ్య చర్యలు...

కర్నూలు నగరపాలక పారిశుద్ధ్య కార్మికులు రోజూ తెల్లవారకముందే రహదారులు, వీధులను శుభ్రం చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాలు, కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లలోనూ పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజ్‌లు ధరించి శుభ్రం చేస్తున్నారు. నగరపాలక పరిధిలో 1100 మంది పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారు.

కరోనా బులెటిన్‌ వివరాలు

కొత్త కేసులు 4
మొత్తం కేసులు 279
చికిత్స పొందుతున్నవారు 239
కోలుకున్న వారు 31
మరణాలు 09

ఇదీ చదవండి:

విజయవాడలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details