కరోనా కర్నూలు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో కొత్తగా 403 మందికి కరోనా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 4226కు చేరింది. బుధవారం కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో మరణాల సంఖ్య 113కు చేరింది.
ఇప్పటి వరకు 2,233 మంది సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా... 1880 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలోని పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. కర్నూలు నగరంలో 1431 మందికి, కర్నూలు గ్రామీణ ప్రాంతంలో 34 మందికి కరోనా సోకింది. నంద్యాల పట్టణంలో 623, నంద్యాల గ్రామీణ ప్రాంతంలో 41, ఆదోని పట్టణంలో 562, ఆదోని గ్రామీణ ప్రాంతంలో 63, డోన్ పట్టణం 158, డోన్ గ్రామీణ ప్రాంతంలో 25, ఎమ్మిగనూరు పట్టణంలో 139మంది కరోనా బారినపడ్డారు.
ఎమ్మిగనూరు గ్రామీణ ప్రాంతంలో 17, ఆత్మకూరు పట్టణంలో 114, ఆత్మకూరు గ్రామీణ ప్రాంతంలో 9, బనగానపల్లి 92, నందికొట్కూరు పట్టణం 83, నందికొట్కూరు గ్రామీణ ప్రాంతంలో 5, కోడుమూరు 77, పాణ్యం 71, పత్తికొండ 44, అవుకు 43, శిరివెళ్ల 33, ఆళ్లగడ్డ పట్టణం 32, ఆళ్లగడ్డ గ్రామీణ ప్రాంతం 2, కౌతాళం 31, దేవనకొండ 26, పెద్దకడుబూరు 24మందికి కరోనా సోకింది.