తమకు న్యాయం చేయాలని ప్రీతీ భాయ్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తమకు ప్రకటించిన 5 ఎకరాల పొలం, 5 సెంట్ల స్థలం, ఉద్యోగం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ వద్దకు వెళితే తమను పోలీసులు అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రీతీబాయ్ 2017 లో కట్టమంచి పాఠశాలలో పదవ తరగతి చదువుతూ.. పాఠశాల వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది. ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పిందని.. ఇంతవరకు సాయం అందలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.
'న్యాయం కోసం వెళితే.. అరెస్ట్ చేశారు'
తమకు న్యాయం చేయాలని వెళితే పోలీసులు అరెస్ట్ చేశారని నాలుగేళ్ల క్రితం కట్టమంచి పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి భాయ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు.
couples proetst at karnulu Collectorate for justice