couple suicide : శ్రీశైలంలో పురుగులమందు తాగి జంట ఆత్మహత్య - srisailam crime
08:53 September 23
మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తింపు
గుంటూరు జిల్లా ఇస్సపాలెంకు చెందిన ఇద్దరు శ్రీశైలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నరసరావుపేట మండలం ఇస్సపాలెంకు చెందిన బత్తుల కాళేశ్వరరావు, నాగలక్ష్మీ గతంలో ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఇద్దరికీ పిల్లలు సైతం ఉన్నారు.
కాళేశ్వరరావు స్వగ్రామంలోనే తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా..నాగలక్ష్మీ నరసరావుపేటలో భర్తతో కలిసి ఉంటోంది. ఇటీవలే కుటుంబంతో కలిసి ఇస్సపాలెం వచ్చి నాగలక్ష్మీ జీవనం సాగిస్తోంది. కాళేశ్వరరావుతో కలిసి శ్రీశైలం వెళ్లిపోయిన నాగలక్ష్మి..సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి చనిపోయారు. ఇరువురు మృతితో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదీచదవండి..