కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో... కౌంటింగ్ ప్రక్రియపై సిబ్బందికి శిక్షణా నిర్వహించారు. ఆళ్లగడ్డ రిటర్నింగ్ అధికారి వెంకట నారాయణమ్మ కీలక సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూములో నుంచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్‌కు తరలించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, కౌంటింగ్ హాల్లో ఈవీఎంలను తెరిచే సమయంలో చేపట్టాల్సిన చర్యలపై.. ఆర్వో.. సిబ్బందికి వివరించారు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల వివరాలను సూచిక బోర్డులపై ఎలా రాయాలో తెలియజేశారు. సహాయ ఎన్నికల అధికారులు హాజరయ్యారు.
ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ - Evms
కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆళ్లగడ్డ ఎన్నికల అధికారి వెంకట నారాయణమ్మ... సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. స్ట్రాంగ్ రూము నుంచి కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంల తరలింపు, ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో చర్చించారు.

కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ
కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి శిక్షణ
ఇవీ చూడండి : ' కొత్త ప్రభుత్వానికి అందరం సహకరిస్తాం'