కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు ధర పలికింది. రెండో రోజూ క్వింటా పత్తి గరిష్ఠ ధర రూ.12,239 పలికింది. ఇవాళ మార్కెట్ యార్డుకు 895 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తీసుకువచ్చినట్లు మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు. రేపటి నుంచి యార్డుకు మూడు రోజులు సెలవులు ఉండటం, దిగుబడులు తగ్గటం, పత్తి గింజల ధరలు పెరగటం వల్ల పత్తికి డిమాండ్ పెరిగిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాల ధరలతో పోలిస్తే.. ఆదోని యార్డులో అత్యధిక ధరలు ఉన్నాయని అంటున్నారు.
Record Price: ఆదోని మార్కెట్ యార్డులో రికార్డు ధర పలికిన పత్తి - రికార్డు ధర పలికిన పత్తి
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో పత్తి రికార్డు స్థాయిలో రూ.12,239 ధర పలికింది. ఇవాళ యార్డుకు మెుత్తం 895 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. కనిష్ఠ ధర రూ.6,279 పలికింది.
ఆదోని మార్కెట్ యార్డులో రికార్డు ధర పలికిన పత్తి