ఆదోనిలో రికార్డు స్థాయిలో పెరిగిన పత్తి ధరలు
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు పెరిగాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి ధరలు రికార్డు స్థాయి పలికాయి. సోమవారం క్వింటాలు పత్తి ధర గరిష్టంగా రూ.7,249, కనిష్టంగా రూ.5200 ధర పలుకుతుంది. ధరలు పెరగడంపై పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పత్తి గింజలు ధరలు పెరగడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఏర్పడిందని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాల్లోని ధరలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఆదోనిలోనే అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు.
ఇదీ చదవండి:తవ్వేదెంత? అమ్మేదెంత?.. గనులశాఖకు లెక్క తేలేది ఎలా?