ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cotton farmers: ఇప్పుడు సరే.. భవిష్యత్​ ఏంటో.. పత్తి రైతుల టెన్షన్​

కర్నూలు జిల్లా పత్తి రైతులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. ధర ఇప్పుడు బాగున్నా.. అది ఎంతకాలం ఉంటుందో తెలియక తికమకపడుతున్నారు. ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా పత్తికి రికార్డు ధర పలుకుతున్నా.. ఖర్చుల భారం, భవిష్యత్‌పై సందేహాలతో బిక్కుబిక్కుమంటున్నారు.

సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న పత్తి రైతులు
సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న పత్తి రైతులు

By

Published : Oct 18, 2021, 10:36 PM IST

కర్నూలు జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులు పత్తిని సాగు చేస్తారు. ఇందులో ఎక్కువమంది వర్షంపై ఆధారపడుతుండగా..కొందరు మాత్రమే బోర్లు, చెరువులు, కాలువల కింద పండిస్తున్నారు. అంతర్జాతీయంగా పత్తి దిగ్గుబడి తగ్గటం వల్ల... ప్రస్తుతం ప్రభుత్వ మద్దతు ధర కన్నా ఎక్కువ రేటు పలుకుతోంది. పొడుగు పింజ పత్తికి క్వింటాల్‌కు 6వేల 25 రూపాయలు, మధ్యస్థ పింజ పత్తికి 5వేల 726 రూపాయల మద్దతు ధర ఉంది. ఆదోని మార్కెట్‌లో అక్టోబర్ 11న రికార్డు స్థాయిలో క్వింటాల్‌ పత్తి 8వేల 639 రూపాయలు పలికింది. బిడ్డింగ్‌లో వ్యాపారుల మధ్య పోటీ ఎక్కువ కారణంగానూ ఎక్కువ ధర లభిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

కర్నూలు జిల్లాలో ఈ ఏడాది సాధారణం కన్నా రెండున్నర శాతం అధికంగా పత్తి సాగైంది. అక్టోబర్ నుంచి రావాల్సిన దిగుబడులు సెప్టెంబర్‌ నుంచే మొదలయ్యాయి. దీంతో ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మంచి ధర లభిస్తున్నా.. వచ్చే నెలలో ఎలా ఉంటుందో అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోళ్లను సీసీఐ చేపట్టనుంది. పంటలో తేమ శాతం 8 దాటితే ధరలో కోత పడుతుందని.. 12 శాతం దాటితే అసలు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది.

సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న పత్తి రైతులు

ఇదీ చదవండి:

murders: మహిళపై అత్యాచారయత్నం.. ఆపై హత్య.. ఆ తర్వాత

ABOUT THE AUTHOR

...view details