ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Cotton: ఆదోని మార్కెట్లో.. పత్తికి రికార్డు ధర - ఆదోని మార్కెట్ యార్డ్​లో రికార్డు స్థాయి ధర పలికిన పత్తి వార్తలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తికి రికార్డు స్థాయి ధర పలికింది. పెరిగిన ధరల పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని మార్కెట్ యార్డ్​లో రికార్డు స్థాయి ధర పలికిన పత్తి
ఆదోని మార్కెట్ యార్డ్​లో రికార్డు స్థాయి ధర పలికిన పత్తి

By

Published : Nov 1, 2021, 6:50 PM IST

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రికార్డు స్థాయిలో పత్తి ధరలు పలికాయి. క్వింటా పత్తి గరిష్ఠంగా రూ. 8,800, కనిష్ఠంగా రూ.6500 ధర పలికిందని మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. మార్కట్ యార్డుకు ఇవాళ 7,578 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చినట్లు వెల్లడించారు. పత్తి ధరలు పెరగడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

పత్తి గింజల ధరలు పెరగడం వల్ల పత్తికు మంచి డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాల ధరలతో పోలిస్తే ఆదోనిలో అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారస్తులు అంటున్నారు.

ఇదీ చదవండి

CBN: ఆ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే.. రాష్ట్రానికి రక్షణ: చంద్రబాబు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details