కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సూచించారు. కరోనా సమయంలో వైకాపా కార్పొరేటర్ అభ్యర్థులు చేసిన సేవ, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ఈ విజయానికి కారణమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే ప్రజలు.. ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని కర్నూలు మేయర్ అభ్యర్థి బీవై రామయ్య అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో నగరాన్ని మోడల్ సిటీగా తయారు చేస్తామన్నారు.
'ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయానికి కారణం' - mla hafeez khan updates
కర్నూలు కార్పొరేషన్‌కు ఎన్నికైన నూతన కార్పొరేటర్లు.. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ను కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చెయ్యాలని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సూచించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో నగరాన్ని మోడల్ సిటీగా తయారు చేస్తామని మేయర్ అభ్యర్థి బీవై రామయ్య తెలిపారు.
!['ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయానికి కారణం' corporators met mla hafeez khan in kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11020141-286-11020141-1615818172566.jpg)
'ప్రభుత్వ సంక్షేమ పథకాలే విజయానికి కారణం'