కర్నూలు జిల్లాలోని మంత్రాలయ క్షేత్రంలో రాఘవేంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండోరోజు రాఘవేంద్రస్వామి 400వ పట్టాభిషేకం మహోత్సవం కనుల పండువగా సాగింది. బంగారు సింహాసనంలో రాఘవేంద్ర స్వామి పాదుకలను ఉంచారు. మఠాధిపతి సుబుదేంద్రతీర్థులు పాదుకలకు బంగారు నాణేలు, ముత్యాలు, గులాబి, చామంతి పుష్పాలతో అభిషేకం నిర్వహించారు. స్వామి పాదుకలను భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
స్వామి వెండి కవచాన్ని, పాదుకలను బంగారు రథంపై, గ్రంథాలను బంగారు పల్లకిలో ఉంచి మఠం వీధుల్లో వేలాది భక్తుల మధ్య ఘనంగా విహరింపజేశారు. పట్టాభిషేకంలో తెలుగు, కన్నడలో ముద్రించిన పంచాంగాన్ని విడుదల చేశారు. ఉదయం ప్రాకారంలో జ్ఞానయజ్ఞ కార్యక్రమాలను నిర్వహించారు. కొత్తగా ప్రతిష్ఠించిన 32 అడుగుల ఏకశిలా అభయాంజనేయ స్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నిర్వహించారు. హనుమంతుడిని 50 లీటర్ల పాలు, పెరుగు, పంచదారతో అభిషేకించారు.
రామ మందిర నిర్మాణం