కర్నూలు జిల్లా ఆదోనిలో టీడ్కో క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితులకు వసతుల సరిగ్గా లేవని ఆందోళన చేశారు. పట్టణంలో కొవిడ్ వచ్చిన బాధితులను టీడ్కో కేంద్రంలో ఉంచుతున్నారు. ఆదివారం వసతి సరిగా కల్పించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజన వసతి కొంత మందికి అందుతుందని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వాపోయారు.
క్వారంటైన్ కేంద్రంలో వసతులు లేవని ఆందోళన.. - adhoni corona news
కర్నూలు జిల్లాలో టిడ్కో క్వారంటైన్ కేంద్రంలో సరైన వసతులు కల్పించలేదని కరోనా బాధితులు ఆందోళనకు దిగారు. అందరికీ భోజనం అందటంలేదని, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మరొవైపు అన్ని వసతులు ఏర్పాటు చేశామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కరోనా బాధితుల ఆందోళన
ఇంట్లో ఏకాంత రూములు ఉన్నా అనుమతి ఇవ్వకుండా, క్వారంటైన్ కేంద్రం తెచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోయారు. మరోవైపు అన్ని వసతులు ఏర్పాటు చేశామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉందని కరోనా బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి