కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంలేదు. శుక్రవారం కొత్తగా 702 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 47,573 మందికి కరోనా సోకగా 40,392 మంది కరోనాను జయించారు. మొత్తం 6792 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో కోలుకోలేక నిన్న ఇద్దరు మృతిచెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 389 మంది చనిపోయారు.
విజృంభిస్తున్న మహమ్మారి... కొత్తగా 702మందికి కరోనా - కర్నూలు జిల్లాలో కరోనా కేసులు
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా 702 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఇప్పటి వరకు 47,573 మందికి కరోనా సోకింది.
విజృంభిస్తున్న కరోనా