కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంలేదు... మంగళవారం వారం కొత్తగా 813 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 45,558 మందికి కరోనా సోకగా 38,550 మంది కరోనాను జయించారు. 6626 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో మంగళవారం నలుగురు మృతిచెందగా ఇప్పటి వరకు కరోనాతో 382 మంది జిల్లా లో చనిపోయరు.