ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్​ అధికారికి కరోనా - corona case increasing at ap

శ్రీశైల దేవస్థానంలో కరోనా కేసు వెలుగు చూసింది. దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ నమోదైంది. ఆయనకు హోం ఐసోలేషన్‌ ద్వారా చికిత్స అందిస్తున్నారు.

corona to srisailam engineer
corona to srisailam engineer

By

Published : Mar 17, 2021, 10:23 AM IST

శ్రీశైల క్షేత్రంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. శ్రీశైల దేవస్థానం ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే ఓ అధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మంగళవారం సదరు అధికారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

ఆయనకు హోం ఐసోలేషన్‌ ద్వారా చికిత్స చేస్తున్నారు. అధికారి కుటుంబ సభ్యులకు నెగిటివ్​గా ఫలితాలు వచ్చాయి. దేవస్థానంలో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలని అధికారులు ఆలోచనలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details