ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందికొట్కూరులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు - corona test in Medical Health Department latest news

తమ ప్రాంతంలో బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకడంపై నందికొట్కూరు అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వైరస్​ను నియంత్రించాలంటే తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వైద్యులు సూచించారు.

Corona tests under the Medical Health Department
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు

By

Published : Jun 29, 2020, 7:26 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది... విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. పట్టణంలో బ్యాంకు ఉద్యోగికి కరోనా సోకిన కారణంగా... ఆమెతో అంతకుముందు కాంటాక్ట్ అయిన 60 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించారు.

స్థానిక సాయిబాబా పేటలోని ప్రాథమిక పాఠశాలలో వారందరి నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యులు కృష్ణమూర్తి తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే మాస్క్​ కచ్చితంగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details