ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్కోచోట ఒకలా కరోనా ఫలితాలు..ఆందోళనలో బాధితులు - corona test results in edurupadu

కర్నూలు జిల్లా ఎదురుపాడులో కరోనా పరీక్షల ఫలితాలు భిన్నంగా రావడంతో ఓ కుటుంబం ఆందోళన చెందుతోంది. ఒక్కో ఆసుపత్రిలో ఒక్కోవిధంగా ఫలితాలు రావడంతో వారు భయపడుతున్నారు.

corona test results different to women at edurupadu
ఎదురుపాడులో కరోనా పరీక్షల ఫలితాలు

By

Published : Aug 7, 2020, 11:02 PM IST


కర్నూలు జిల్లా ఎదురుపాడులో కరోనా పరీక్షల ఫలితాలు భిన్నంగా రావడంతో ఓ కుటుంబం ఆందోళన చెందుతోంది. గ్రామానికి చెందిన పవిత్ర ఈనెల 5న ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రసవం కోసం వెళ్లింది. అక్కడ ఆమెకు కొడుకు పుట్టాడు. ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వెంటనే వైద్యులు కర్నూలుకు వెళ్లమని చెప్పారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె వెళ్లగా..అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. కర్నూలు ఆసుపత్రి వైద్యులు ఇంటికి వెళ్లి హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు. పరీక్ష ఫలితాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని... బాలింత కాబట్టి కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స అందించాలని బాధితురాలి భర్త కోరుతున్నారు.


ఇదీ చూడండి. 'సంబంధం లేదంటే అమరావతి రైతుల త్యాగాలను అవమానించినట్లే'

ABOUT THE AUTHOR

...view details