ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొత్తగా 63 మందికి కరోనా.. కోలుకున్న 2 నెలల చిన్నారి

By

Published : Jun 15, 2020, 11:54 PM IST

కర్నూలు జిల్లాలో సోమవారం 63 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదోనిలోనే తాజాగా మరో 36 మందికి పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి 24 మంది డిశ్చార్జ్​ కాగా.. అందులో 2 నెలల చిన్నారి ఉంది. ఈ సందర్భంగా కలెక్టర్​ వైద్యులను అభినందించారు.

corona postive cases incrasing kunrool dst
corona postive cases incrasing kunrool dst

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. జిల్లాలో 1,842 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 63 మందికి పాజిటివ్​గా తేలింది. అత్యధికంగా ఆదోని, కర్నూలు నగరంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఆదోనిలో 36, కర్నూలులో 12, ఆత్మకూరులో 7, ఎమ్మిగనూరులో 3, కౌతాళంలో 1, ఆత్మకూరు రూరల్​లో ఒక కేసు నమాదు కాగా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకింది.

కోలుకున్న 2 నెలల చిన్నారి

సోమవారం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి 24 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో రెండు నెలల చిన్నారి ఉంది. దేవనకొండ మండలం తెర్నేకల్​కు చెందిన చిన్నారి.. కరోనాతో జీజీహెచ్​లో చికిత్స పొందింది. చిన్నారి కరోనాను జయించడంపై జిల్లా కలెక్టర్​ వీరపాండియన్​ వైద్యులను అభినందించారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాను జయించిన వారి సంఖ్య 853 కి చేరింది.

ఇదీ చూడండి..

దేశంలో మరో 11,502 కేసులు.. 325 మరణాలు

ABOUT THE AUTHOR

...view details