కర్నూలు జిల్లాలోని కస్తూర్బా విద్యాలయంలో కరోనా కలకలం రేపింది. దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగరంలో ఉన్న కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 35 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. వీరందరిని ప్రత్యేక గదుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఒకేసారి ఇంతమందికి కరోనా సోకటంతో.. పాఠశాలలోని మిగతా విద్యార్థినులు ఉపాధ్యాయ, సహాయక సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.
కస్తూర్బా విద్యాలయంలో 35 మంది విద్యార్ధులకు కరోనా - విద్యార్ధులకు కరోనా తాజా వార్తలు
కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థినులకు కరోనా పాజిటివ్ రావటం.. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగరంలో అలజడి రేపుతోంది. 35 మంది విద్యార్థినులకు కరోనా సోకినట్లు నిర్ధరించిన అధికారులు.. వారందరిని ప్రత్యేక గదుల్లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
కస్తూర్బా విద్యాలయంలో విద్యార్ధులకు కరోనా