కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పరీక్షా ఫలితాలు గందరగోళానికి గురి చేశాయి. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి గత నెలలో దిల్లీలో మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. అధికారులు అతన్ని కొన్ని రోజుల పాటు గోస్పాడు క్వారంటైన్‌కు తరలించారు. అతనికి మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 23న అతన్ని ఇంటికి పంపారు. 24న అతనికి అధికారులు ఫోన్ చేసి పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు వెళ్లగా తాను రానని చెప్పాడు. ఎట్టకేలకు శనివారం రాత్రి అతన్ని ఆసుపత్రికి తరలించారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలియాల్సి ఉందన్నారు అధికారులు.
నంద్యాలలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి డిశ్ఛార్జ్
గుంటూరులో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని పొరపాటున డిశ్ఛార్జ్ చేసిన ఘటన మరవకముందే నంద్యాలలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొవిడ్ నెగెటివ్ వచ్చిందని ఓ వ్యక్తిని ఇంటికి పంపిన అధికారులు... అనంతరం పాజిటివ్‌గా తేలిందంటూ ఆసుపత్రికి తరలించారు.
corona positive patient discharged in nandyal