కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జొహారాపురం గ్రామంలో 11 నెలల చిన్నారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి దిల్లీ మర్కజ్ వెళ్లి రావటంతో వారందరినీ క్వారంటైన్‌కు తరలించారు. క్వారంటైన్ పూర్తైన అనంతరం వారిని పరీక్షించగా నెగిటివ్ రావడం వల్ల ఇటీవలే వారు ఇంటికి తిరిగి వచ్చారు. మరోసారి వారికి వైద్య పరీక్షలు చేయగా.. ఆ కుటుంబంలో చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న ఆదోని డీఎస్పీ రామకృష్ణ, ఆలూరు సీఐ భాస్కర్ గ్రామాన్ని సందర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
కర్నూలులో 11 నెలల చిన్నారికి కరోనా - కర్నూలులో 11 నెలల చిన్నారికి కరోనా
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కర్నూలులో కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11 నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
Corona positive for 11 month old child at Joharapuram in kurnool