ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో ఒక్కరోజే 66 మందికి కరోనా పాజిటివ్ - కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య

కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరోజే జిల్లాలో 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం జిల్లాలో 2961 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 66 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.

corona positive cases
corona positive cases

By

Published : Jun 23, 2020, 12:25 PM IST

కర్నూలు జిల్లాలో సోమవారం 66 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 25, నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 3, ఆదోని మున్సిపాలిటీ పరిధిలో 6, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో 2, నందికొట్కూరు, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో ఒకొక్కరికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. కౌతాళంలో 12 మందికి, ఆళ్లగడ్డ రూరల్, చిప్పగిరి, దేవనకొండ, కొత్తపల్లి, మద్దికెర, మంత్రాలయం, మిడుతురు, నందవరం, పాణ్యం, తుగ్గలిలో ఒకొక్కరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ఇతరరాష్ట్రల నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1354కు చేరింది. కొవిడ్ బారినపడి 762 మంది కోలుకున్నారు. 557 మంది చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details