కర్నూలు జిల్లాలోని విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం 3 గంటలైనా భోజనాలు రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీపీ, షుగర్ వంటి జబ్బులతో బాధపడుతున్నవారు ఉన్నారని భోజనాల విషయంలో ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగుల ఆందోళన - కర్నూలులో కరోనా వార్తలు
సకాలంలో ఆహారం అందించలేదని కరోనా సోకిన రోగులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో జరిగింది.

కర్నూలు జిల్లా విశ్వభారతి కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులు ఆందోళన