కర్నూలు జిల్లా ఆదోని టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ వద్ద దారుణ పరిస్థితి నెలకొంది. కేంద్రంలో కరోనా బాధితులు 600 మంది దాకా ఉన్నారు. ఇక్కడ ఓ వాహనంలో వైద్యులు వచ్చి పరీక్షలు చేసి మందులు అందించి వెళ్తున్నారు. దీంతో అందరూ గదుల నుంచి బయట గంటల తరబడి ఎండ, వానలకు వరుసలో నిల్చుని సేవలు పొందాల్సి వస్తోంది.
వైద్యం కోసం కరోనా రోగులు బారులు
కర్నూలు జిల్లా ఆదోని టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్యం కోసం బారులు తీరి అవస్థలు పడుతున్నారు.
వైద్యం కోసం కరోనా రోగులు బారులు
వృద్ధులు, దివ్యాంగులు నిలబడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. తమని హోమ్ క్వారంటైన్ లో ఉంటామంటే అనుమతి ఇవ్వకుండా.. కొవిడ్ సెంటర్ కు తీసుకొచ్చి కుంగదీసేలా చేస్తున్నారని కొవిడ్ బాధితులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి: మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు