కర్నూలు నగరంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లాక్డౌన్ నియమాలను కట్టుదిట్టం చేశారు. అనవసరంగా బయటికి వచ్చిన ద్విచక్రవాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నిలువరిస్తున్నారు.
ఇప్పటి వరకూ 50 వాహనాలను సీజ్ చేశారు. ద్విచక్ర వాహనదారులను వాహనాలతోపాటుగా 2 కిలోమీటర్ల దూరం నడిపించారు. సరైన కారణం లేకుండా బయట తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.