కర్నూలు జిల్లా అదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ బాలింతకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆస్పత్రిలోని బాలింతలు అదోళన చెందుతున్నారు. ఆస్పరి మండలం చిరుమాన్ దొడ్డి గ్రామానికి చెందిన శాంతికి నాలుగు రోజుల క్రితం స్థానిక ఆస్పత్రిలో వైద్యులు కాన్పు చేశారు. ఇవాళ బాలింతకు కరోనా పాజిటివ్ రావడంతో తల్లి, బిడ్డను కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు మహిళ నాలుగు రోజులుగా కాన్పు వార్డులోనే ఉన్నందున బాలింతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి వార్డులో శానిటేషన్ చేయించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: