కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య నేడు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో మంగళవారం 100 మందికి పాజిటివ్ గా నమోదు అయ్యింది ఇప్పటి వరకు 58,636 మందికి కరోనా సోకింది. 56,947 మంది కరోనాను జయించి సురక్షితంగా వున్నారు. 1209 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా నేడు జిల్లాలో మరణాలు నమోదు కాలేదు. ఇప్పటివరకు జిల్లాలో కరోనాతో 480 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా - kurnool district corona update news
కర్నూలు జిల్లాలో కరోనా విజృంభన కొంత మేర తగ్గినట్లే కనిపిస్తోంది. కాగా ఈరోజు కరోనా కారణంగా మరణాలు నమోదు కాకపోవడం కొంత ఊరట ఇచ్చిన అంశంగా అధికారులు తెలిపారు.
జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా
ఇవీ చూడండి...