కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో గురువారం ఒక్కరోజే 78 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. జిల్లాలో ఉండే వారికి 50 మందికి రాగా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 24 మందికి సోకింది. గతంలో పాజిటివ్ వచ్చి కోలుకున్న నలుగురు వ్యక్తులకు నేడు తిరిగి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆదోనిలో 35 మందికి, కర్నూలు, ఆదోని రూరల్లో ఆరుగురికి, బనగానపల్లె, నంద్యాల, ఓర్వకల్లులో ఒకొక్కరికి కరోనా సోకింది.
జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు - kurnool district latest news
కర్నూలు జిల్లాలో గురువారం మొత్తం 2,353 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 78 మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో జిల్లా నుంచి 50 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 24 మందికి వ్యాధి సోకింది.

పెరుగుతున్న కరోనా కేసులు