ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఇప్పటివరకూ 2500 నమోదు

కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో 2500 కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 మంది మృతిచెందారు. పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

corona cases in nandyal kurnool district
నంద్యాలలో కరోనా కేసులు

By

Published : Jul 31, 2020, 11:32 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లాలో 2500 కేసులు నమోదయ్యాయి. మొత్తం 13 మంది మృతిచెందారు.

* పురపాలక సంఘం కమిషనర్​తోపాటు కార్యాలయంలో మరో 10 మందికి వైరస్ సోకింది. వారు క్వారంటైన్​లో ఉన్నారు.

* నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పలువురు శాస్త్రవేత్తలకు, బోధనేతర సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. కరోనాతో టైం స్కేల్ కూలీగా పనిచేసే ఒకరు మృతిచెందారు.

* రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో పనిచేసే పలువురు ఉద్యోగులు కొవిడ్ బారిన పడి, క్వారంటైన్​లో ఉంటున్నారు.

* ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకూ వైరస్ సోకింది. పలువురు వ్యాపారులకు కరోనా పాజిటివ్ రావటంతో నంద్యాలలో ఆగస్టు 1 నుంచి దుకాణాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి...

అంబులెన్సుల సిబ్బందీ కరోనా బాధితులే..

ABOUT THE AUTHOR

...view details