కర్నూలు జిల్లాలో నేడు 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రేపటితో మూడో దశ లాక్డౌన్ ముగుస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. జిల్లాలో 50 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, వీటిలో 9 జోన్లలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వీటిని కంటైన్మెంట్ జోన్ల నుంచి తొలగిస్తామని తెలిపారు.
జిల్లాలో 9 జోన్లు కంటైన్మెంట్ నుంచి తొలగింపు! - corona cases in kurnool news
కర్నూలు జిల్లాలో కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17వ తేదీతో మూడవదశ లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
![జిల్లాలో 9 జోన్లు కంటైన్మెంట్ నుంచి తొలగింపు! corona cases in kurnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7226629-983-7226629-1589639168104.jpg)
corona cases in kurnool
ప్రభుత్వ ఆదేశాల మేరకు 18వ తేదీ నుంచి కంటైన్మెంట్ జోన్లు మినహా కొన్ని వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. దుకాణం, దుకాణం మధ్య రెండు షాపులు మూసివేయాలన్నారు. ప్రజలు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించి మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి