కర్నూలు జిల్లాలో కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. జిల్లాలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నందున లాక్ డౌన్‌ని కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ రోజు జిల్లాలో కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయని.. వీటిలో కర్నూలులో రెండు, నంద్యాలలో రెండు, మహానంది మండలంలో రెండు, ఆదోనిలో ఒకటి నమోదైనట్లు తెలిపారు.
లాక్డౌన్ నిబంధనలు కఠినతరం: జిల్లా కలెక్టర్
కర్నూలులో కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ను కఠినతరం చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. నేడు జిల్లాలో కొత్తగా 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని ప్రజలు బయపడాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ రోజు డిశ్చార్జ్ అయిన వారిలో 14 నెలల చిన్నారితో పాటు 80 సంవత్సరాల వృద్ధుడు కూడా ఉన్నట్లు తెలిపారు. విశాఖ ఘటన నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయన్నారు.