ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి కరోనా గుప్పిట్లో కర్నూలు చిక్కే అవకాశం!

కర్నూలు, కర్నూలు సచివాలయం -న్యూస్‌టుడే: తుంగభద్ర పుష్కరాలను కరోనాకు సూపర్‌ స్పెడ్డర్స్‌గా మార్చొద్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నెండు రోజులపాటు జరిగే పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తారు. ఇలా వచ్చే భక్తులకు అవగాహన కల్పించాల్సిన జిల్లా మాస్‌ మీడియా నిద్రపోతోంది. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం పెంచేలా చేయాల్సిన ఈ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పండగల సందర్భంగా అంటువ్యాధులు ప్రబలకుండా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన సమయంలో సిబ్బంది పత్తా లేరు. పైగా కరోనా అంటే కర్నూలు అనేలా వైరస్‌ విజృంభించినా ఇంకా మార్పు రాలేదు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా, అవగాహనా లేమితో భక్తులు వ్యవహరిస్తే సెకండ్‌ వేవ్‌తో ఇబ్బంది పడేది జిల్లావాసులే.

corona cases in kurnool district
corona cases in kurnool district

By

Published : Nov 20, 2020, 12:12 PM IST

కర్నూలు జిల్లాలో పుష్కరాల సమయంలో హుషారుగా కనిపించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ నీరసించింది. భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌కి ఏర్పాట్లు చేయలేదు. అనుమానం ఉన్నవారికి కరోనా పరీక్షలు చేసే కేంద్రాల వైపు అడుగులు అంతంతమాత్రమే పడ్డాయి. ఊహించని విధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే అప్పటికప్పుడు ఏం చేయలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కో ఘాట్‌కు ఒక్కో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఢంకా మోగించారే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. సంకల్‌బాగ్‌ మినహా మిగిలినచోట్ల అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి.

ఇప్పటికైతే ఊసేలేదు..

జిల్లాలో అన్ని పట్టణ కూడళ్లలో కొవిడ్‌ నిబంధనలపై అవగాహన కల్పించే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రచార వాహనాలను ఏర్పాటు చేయలేదు. కనీసం కార్పొరేషన్‌ అధికారులను సంప్రదించి ప్రచార వాహనాలను ఉపయోగించుకోవాలన్న ప్రయత్నాలు జరగలేదు. ఇంతవరకు ఎక్కడా నిబంధనలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టలేదు. నగరవాసులకైనా చైతన్యం కల్గించేలా కరపత్రాల ముద్రించినా ఆశించిన స్థాయిలో పంపిణీ జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి.

పుష్కర నిధుల్లేవు

వైద్య, ఆరోగ్య శాఖ పుష్కరాలకు సంబంధించి 9 పనులకు రూ.1.84 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్‌ నుంచే నిధులు వాడుకోవాలని సూచించింది. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసే వైద్యశిబిరాలకు కావాల్సిన మందులు, ఫాగింగ్‌ యంత్రాలను ఏపీహెచ్‌ఎంఐడీసీనే కొనుగోలు చేసి అందించింది. శిబిరానికి ఇద్దరు వైద్యులకు విధులు నిర్వహించేలా ప్రణాళికలు చేశారు. దీనిపై డీఎంహెచ్‌వో రామగిడ్డయ్యను వివరణ కోరగా...ఫ్లెక్సీలు, పోస్టర్లు సిద్ధంగా ఉన్నాయని, ఏర్పాటు చేస్తామన్నారు. తెల్లవారితే పుష్కరాలుంటే ఇంకా ఏర్పాటు చేస్తామనే ఆలోచనలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు.

ఇదీ చదవండి:అలల సిరులవేణి.. సస్యసీమల రాణి

ABOUT THE AUTHOR

...view details