కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. జిల్లాలో శుక్రవారం 206 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 55,456 మందికి కరోనా సోకింది.
52, 863 మంది కరోనాను జయించారు. 2,134 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఈరోజు ఒక్కరు చనిపోగా.. ఇప్పటి వరకు జిల్లాలో కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 459 మందికి చేరింది.